ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసీదులు, చర్చిల వద్ద జెండా పండుగ

ABN, First Publish Date - 2022-08-13T08:01:59+05:30

మసీదులు, చర్చిల వద్ద జెండా పండుగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైనార్టీశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌


అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వారసత్వపు కట్టడాలు, పురాతన మసీదులు, చర్చిల వద్ద శుక్రవారం జెండా పండుగ నిర్వహించినట్టు రాష్ట్ర మైనార్టీశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జెండా మహోత్సవంలో భాగంగా సీఎం జగన్‌ పిలుపు మేరకు ముస్లింలు, క్రైస్తవులు.. శుక్రవారం ప్రార్థనల అనంతరం జాతీయ జెండాలు చేబూని ర్యాలీలు నిర్వహించినట్లు ఒక ప్రటనలో పేర్కొన్నారు. విజయనగరంలోని జామియా మసీదు అతిపురాతనమైనదిగా పేరొందిందని ఆ మసీదు ఇమామ్‌, మౌజమ్‌ నిర్వహణా కమిటీ సభ్యులు ఇతర ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారని చెప్పారు. ఏలూరులోని మదరసాలో విద్యార్థులు జాతీయ జెండా ఎగురవేస్తూ ర్యాలీలు నిర్వహించారన్నారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు తదితర జిల్లాల్లో జాతీయ జెండాలతో ముస్లింలు, క్రైస్తవులు ర్యాలీ తీసి జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.

Updated Date - 2022-08-13T08:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising