ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన విద్యావిధానంతో ఉపాధి అవకాశాలు

ABN, First Publish Date - 2022-05-22T09:05:07+05:30

నూతన విద్యావిధానంతో ఉపాధి అవకాశాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయలసీమ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ 


కర్నూలు(అర్బన్‌), మే 21: జాతీయ నూతన విద్యా విధానంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. శనివారం కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో ఆయన వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీ.. మేక్‌ ఇన్‌ ఇండియా 2020లో భాగంగా కొత్త విద్యావిధానాన్ని తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. చదువు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే ఉపాధి అవకాశాలు అందుకునే విధంగా నూతన విద్యకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా యూనివర్సిటీల్లో పెను మార్పులు, చేర్పులు చేశారని ఆయన చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అభివృద్ధ్దికి చర్యలు తీసుకుంటున్నామని తె లిపారు. అంతకుముందు ఉపకులపతి ఎ,ఆనందరావు అధ్యక్షతన ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు, మరో 66 మందికి బంగారు పతకాలు అందజేశారు. 241 మందికి పీహెచ్‌డీలు,1267 మందికి పీజీ, 15,339 మందికి యూజీ పట్టాలను ప్రదానం చేశారు.

Updated Date - 2022-05-22T09:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising