ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు కుచ్చుటోపీ!

ABN, First Publish Date - 2022-05-22T08:41:01+05:30

రైతులకు కుచ్చుటోపీ!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.3 కోట్ల మేర ఎగ్గొట్టి పరారైన వ్యాపారి


దర్శి, మే 21: రైతులకు రూ.3 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి ఒక వ్యాపారి పరారయ్యాడు. ధాన్యం విక్రయించిన రైతులు నగదు ఇచ్చిన బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని త్రిపురసుందరీపురానికి చెందిన బొల్లా శేషయ్య 20 ఏళ్లుగా ఎరువుల వ్యాపారంతో పాటు రైతులు పండించిన ధాన్యం, కందులు, పెసలను కూడా కొనుగోలు చేసేవాడు. కనిగిరి చుంచి వచ్చి స్థిరపడిన అతడు.. చుట్టుపక్కల గ్రామాల రైతులతో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. నమ్మకంతో శేషయ్య వ్యాపారం కొనసాగిస్తుండటంతో కొంతమంది వడ్డీకి నగదు కూడా ఇచ్చేవారు. ధాన్యం అపరాలు విక్రయించిన రైతుల్లో కొందరు డబ్బులు తీసుకోకుండా ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. ఇలా దాదాపు 50మందికి పైగా రైతులకు రూ.3కోట్ల మేర అతడు  చెల్లించాల్సి ఉంది. ఈక్రమంలో కొంతమంది తమ నగదు తిరిగివ్వాలని శేషయ్యను కోరగా.. రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఒత్తిడి పెరగటంతో ఈనెల 11న కుటుంబ సభ్యులతో కలిసి గ్రామం నుంచి వెళ్లిపోయాడు. పదిరోజులైనా వారు తిరిగి రాకపోవటంతో మోసపోయామని రైతులు గ్రహించారు. న్యాయం జరిగేలా చూడాలంటూ సుమారు 50 మంది రైతులు దర్శి పోలీసులను ఆశ్రయించారు. 

Updated Date - 2022-05-22T08:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising