ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నవారిపై కర్కశం

ABN, First Publish Date - 2022-05-22T08:39:41+05:30

కన్నవారిపై కర్కశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లు ఖాళీ చేసి పోవాలని కుమారుడి దాడి

తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన వృద్ధ దంపతులు


ఆకివీడు, మే 21: ఇల్లు, స్థలం విషయంలో.. వృద్ధులైన తల్లిదండ్రులను మానవత్వాన్ని మరిచిన కొడుకు కిరాతకంగా గాయపర్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ బీవై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. స్థానిక సాయిదుర్గనగర్‌లో తోట ఉమామహేశ్వరరావు (69), కుసుమ (58) నివాసముంటున్నారు. కొన్నేళ్ల క్రితం పెద్ద కుమార్డు చనిపోగా, చిన్న కొడుకు పెద్దిరాజు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఇల్లు తనకు ఇచ్చేసి బయటకు వెళ్లిపోవాలంటూ మూడు నెలల నుంచి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. పెద్దలు నచ్చచెప్పడంతో తన బెడ్‌రూమ్‌, కిచెన్‌కు తాళం వేసుకొని వేరేచోట అద్దెకు ఉంటున్నాడు. మరో బెడ్‌రూమ్‌, హాల్‌లో ఉంటున్న తల్లిదండ్రులు.. వాస్తురీత్యా ఇబ్బంది రావడంతో కుమారుడు తాళం వేసుకెళ్లిన బెడ్‌రూమ్‌ తాళాన్ని శనివారం పగలగొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దిరాజు ఇంటికి వచ్చి గునపం, మోటారుసైకిల్‌ జోకర్లతో తల్లిదండ్రులను కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. ఇల్లు వదిలి బయటకు పోవాలంటూ హెచ్చరించాడు. స్థానికులు స్పందించి గాయపడిన దంపతులిద్దరినీ భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కుసుమకు 35 కుట్లు, ఉమామహేశ్వరరావుకు 10 కుట్లు పడ్డాయని బంధువులు తెలిపారు.

Updated Date - 2022-05-22T08:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising