ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బసవతారకం ట్రస్టుకు 10 లక్షల విరాళం

ABN, First Publish Date - 2022-05-22T08:24:25+05:30

బసవతారకం ట్రస్టుకు 10 లక్షల విరాళం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు తూర్పు, మే 21: బసవతారకం ట్రస్టుకు గుంటూరుకు చెందిన భాష్యం ప్రవీణ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు భాష్యం ప్రవీణ్‌ రూ.పది లక్షల విరాళాన్ని అందజేశారు. 

హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలు

ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం

సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే.. ఎస్‌టీఎఫ్‌ఐ నేతల డిమాండ్‌


విజయవాడ(గవర్నర్‌పేట), మే 21: ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు హరిస్తున్నాయని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌టీఎఫ్‌ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ భారతి అన్నారు. జాతీయ విద్యావిధానం రద్దు, సీపీఎస్‌ రద్దుపై జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్మించనున్నట్టు వెల్లడించారు. విజయవాడలో జరగుతున్న ఎస్‌టీఎఫ్‌ఐ మూడు రోజుల జాతీయ మహాసభల్లో భాగంగా శనివారం మహాసభలు ఆమోదించిన పలు తీర్మానాలను నేతలు వివరించారు. అట్టడుగు వర్గాల వారికి న్యాయం అందని ద్రాక్షగా మారిందన్నారు. ఎమ్మెల్సీ ఎస్‌కే సాబ్జీ, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


ఎస్‌టీఎఫ్‌ఐ తీర్మానాలు

రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేయాలి. వృత్తిపన్ను మినహాయింపు స్లాబులను రూ.7.50 లక్షలకు పెంచాలి. రిటర్డ్‌ ఉద్యోగులకు వృత్తిపన్ను మినహాయించాలి. సొంత ఇల్లులేని వారికి హెచ్‌ఆర్‌ఏకి పన్ను మినహాయించాలి. సంపదను అందరికీ పంపిణీ చేయాలి. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలి. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.

Updated Date - 2022-05-22T08:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising