ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడలో క్యాసినో గ్యాంబ్లింగ్‌ ఆటలపై జిల్లా ఎస్పీకి టీడీపీ సభ్యుల బృందం ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-01-18T00:31:24+05:30

గుడివాడలో క్యాసినో గ్యాంబ్లింగ్‌ ఆటలపై జిల్లా ఎస్పీకి టీడీపీ సభ్యుల బృందం ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పేరుతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: గుడివాడలో క్యాసినో గ్యాంబ్లింగ్‌ ఆటలపై జిల్లా ఎస్పీకి టీడీపీ సభ్యుల బృందం ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పేరుతో గ్యాంబ్లింగ్‌ అసభ్యకర నృత్యాలు జరిగాయన్నారు. గుడివాడ కే కన్వెన్షన్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్‌, క్యాసినో నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరికట్టాల్సిన పోలీసులు వాటిని నివారించలేకపోయారని పేర్కొన్నారు. కనుమ పండుగ రోజు గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఎ-కన్వెన్షన్‌ లో విచ్చలవిడిగా బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, చట్టవిరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. సుమారు 500 కోట్ల రూపాయలు మేరా డబ్బులు క్యాసినో ద్వారా చేతులు మారాయని వారు ఆరోపించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగువారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. సంఘ విద్రోహక శక్తులు కూడా పెద్ద ఎత్తున చొరపడ్డారని లేఖ ద్వారా తెలిపారు. ఎస్పీని కలిసిన వర్ల రామయ్య, మాజీ ఎంపి కొనకల్ల నారాయణ, ఎమ్మెల్యే గద్దే రామోహన్‌, ఎమ్మెల్సీ బొచ్చల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా, రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. 

Updated Date - 2022-01-18T00:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising