జగన్‌రెడ్డి సర్కార్‌పై పవన్ కల్యాణ్ ఫైర్
ABN, First Publish Date - 2022-10-17T23:38:35+05:30
జగన్‌రెడ్డి సర్కార్‌పై పవన్ కల్యాణ్ ఫైర్
విజయవాడ: సీఎం జగన్‌రెడ్డి సర్కార్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. తాము ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలే చేశామన్నారు. ఒక పార్టీ కార్యక్రమానికి ఎదురెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. వైసీపీ నేతల్లాగా దిగజారుడుతనం తమకు లేదన్నారు. వైసీపీది ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని విమర్శించారు. వైసీపీలా మాట మార్చే అలవాటు తమకు లేదన్నారు. ప్రభుత్వంలో ఉండి గర్జనలు, కూతలు ఏంటి? అని పవన్ ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 3 రాజధానులు ముందుకెళ్లడం లేదు కాబట్టే ఈ ఎత్తుగడ అన్నారు.
Updated Date - 2022-10-17T23:38:35+05:30 IST