మళ్లీ మళ్లీ మోసం చేస్తున్నారు: బీసీ సంఘాలు
ABN, First Publish Date - 2022-12-07T15:44:59+05:30
నగరంలో టీడీపీ (TDP) ఆధ్వర్యంలో పెద్దఎత్తున బీసీ (BC)లు ఆందోళన దిగారు. భిక్షాటనతో అర్ధనగ్న ప్రదర్శన, ఖాళీ పళ్లాలతో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
నెల్లూరు: నగరంలో టీడీపీ (TDP) ఆధ్వర్యంలో పెద్దఎత్తున బీసీ (BC)లు ఆందోళన దిగారు. భిక్షాటనతో అర్ధనగ్న ప్రదర్శన, ఖాళీ పళ్లాలతో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లలో బీసీలను అణగదొక్కారని బీసీ సంఘాలు మండిపడ్డాయి. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీసీలకు పనికిరాని పదవులిచ్చి మభ్యపెట్డారని బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రాయలసీమ గర్జన పేరుతో బీసీలను మళ్లీ మళ్లీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-12-07T15:45:00+05:30 IST