భర్తే చంపాడా... ? లేక ఇంకేమై ఉండొచ్చో..!!
ABN, First Publish Date - 2022-10-17T21:59:17+05:30
భర్తే చంపాడా... ? లేక ఇంకేమై ఉండొచ్చో..!!
పల్నాడు: జిల్లాలోని మాచర్లలో కిడ్నాప్ కలకలం రేగింది. మౌనిక అనే మహిళా అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు. మౌనిక అదృశ్యం విషయంలో రెండు వర్గాల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. భర్త నర్సిరెడ్డే చంపాడని భార్య కుటుంబం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాల ఘర్షణతో అక్కడ పరిస్థితి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు చెదరగొట్టడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది.
Updated Date - 2022-10-17T21:59:17+05:30 IST