ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నపూర్ణ రాష్ట్రాన్ని ‘గంజాయి’గా మార్చారు: సంధ్యారాణి

ABN, First Publish Date - 2022-09-30T09:57:43+05:30

అన్నపూర్ణ రాష్ట్రాన్ని ‘గంజాయి’గా మార్చారు: సంధ్యారాణి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేశంలో అన్నపూర్ణగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వం గంజాయికి స్వర్గధామంగా మార్చిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. గత ఒక్క ఏడాదిలో రాష్ట్రంలో పట్టుబడిన గంజాయి విలువ రూ. ఐదున్నర వేల కోట్లని, పట్టుబడకుండా రవాణా అయిన గంజాయి విలువ దీనికి పది రెట్లు ఉంటుందని ఆ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి గురువారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఒక్క వ్యాపారంలోనే రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు గంజాయి రవాణాలో తలదూర్చి విపరీతంగా సంపాదిస్తున్నారని, వారి వాహ నాల్లోనే రవాణా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయని ఆమె చెప్పారు. ‘ఉత్తరాంధ్ర సంస్కృతిని గంజాయి నాశనం చేస్తున్నా వైసీపీ నేతలు ఏ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించరు. ఉత్తరాంధ్ర భూముల దోపిడీ జరుగుతున్నా... రుషి కొండ బోడి కొండ అవుతున్నా... విశాఖ ఉక్కు అమ్మకం జరుగుతున్నా వారికి పట్టదు. ప్రజలకు పట్టని అంశాలపై మాత్రం రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తారు’ అని ఆమె విమర్శించారు. 

Updated Date - 2022-09-30T09:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising