ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరీశ్‌.. ఏపీకి వచ్చి అడగండి

ABN, First Publish Date - 2022-09-30T09:40:56+05:30

హరీశ్‌.. ఏపీకి వచ్చి అడగండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయులను అడిగితే వాస్తవం తెలుస్తుంది

తెలంగాణ, ఏపీ పీఆర్సీలను పక్కపక్కన 

పెట్టి చూస్తే ఎవరిది బాగుందో తెలుస్తుంది

అలాగే ఫిట్‌మెంట్‌ ఎంతెంత ఇచ్చారు? 

రెండు చోట్లా బేరీజు వేసుకోండి: బొత్స 


విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేతనాలు, పీఆర్సీ పరంగా ఎలాంటి ఇబ్బందులూ లేవని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో టీచర్ల పరిస్థితి బాగోలేదని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన విశాఖలో స్పందించారు. ‘‘హరీశ్‌ రావు అలా మాట్లాడి ఉంటే.. ఆయన ఒకసారి ఏపీకివచ్చి టీచర్లను అడిగినా లేదా వేరేవారిని అడిగినా వాస్తవం తెలుస్తుంది’’ అని బొత్స అన్నారు. తెలంగాణ టీచర్ల పీఆర్సీ, మన టీచర్ల పీఆర్సీని పక్కపక్కన పెట్టిచూస్తే ఎవరిది బాగుందో తెలుస్తుందన్నారు. ‘‘ఫిట్‌మెంట్‌ మనమెంత ఇచ్చాం.. వారెంత ఇచ్చారు? పీఆర్సీ మనమెంత ఇచ్చాం.. వాళ్లెంత ఇచ్చారు? తక్షణం ఉద్యోగులకు ఎంత లబ్ధి కలుగుతుంది. తెలంగాణలో 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేస్తే ఎంత వస్తుంది.. మన దగ్గర ఎంత వస్తుందో బేరీజు వేసుకోమనండి’’ అన్నారు. 


Updated Date - 2022-09-30T09:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising