ఇంధన పరిరక్షణలో ఏపీకి జాతీయ అవార్డు
ABN, First Publish Date - 2022-12-15T03:05:01+05:30
ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తాచాటింది. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్రం ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డును అందజేసింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న అధికారులు
న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తాచాటింది. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్రం ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డును అందజేసింది. ఇంధన వినియోగం ఆధారంగా దేశంలోని రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించగా.. రెండో గ్రూపు లో ఉన్న ఏపీ అత్యుత్తమ పనితీరు కనబరిచి మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. అలాగే జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎ్‌సఈసీఎం)కు ఇది ఐదో జాతీయ పురస్కారం. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎ్‌సఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
Updated Date - 2022-12-15T03:05:03+05:30 IST