ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వినుకొండలో డిగ్రీ కాలేజ్ కబ్జాకు గురైందంటూ హైకోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2022-10-17T17:57:37+05:30

వినుకొండలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కబ్జాకు గురైందంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వినుకొండలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కబ్జాకు గురైందంటూ ఏపీ హైకోర్టు (AP Highcourt)లో పిటిషన్ దాఖలైంది. ఎస్‌జీకే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (SGK Government degree college) స్థలాన్ని మున్సిపాలిటీ అధికారులు కబ్జా చేస్తున్నారంటూ స్టూడెంట్ యూనియన్ లీడర్ వెంకట్ సుబ్బారావు పిటిషన్ దాఖలు చేశారు. 38 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం 5 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టుకు తెలిపారు. కబ్జాకు గురైన స్థలంలో క్రీడా వికాసకేంద్రం కడుతున్నారని న్యాయవాది చెప్పారు.


మున్సిపాలిటీ తరుపున ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపిస్తూ ఇతరులు కబ్జాకు పాల్పడుతున్న నేపథ్యంలో క్రీడా వికాస కేంద్రం కడుతున్నామని వాదనలు వినిపించారు. అంటే ఇతరులు కబ్జా చేస్తున్నారు కాబట్టి మీరు కబ్జాకు పాల్పడుతున్నారా అంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ కాలేజీలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ, రెవిన్యూ అధికారులను ధర్మాసనం ఆదేశిస్తూ... తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-10-17T17:57:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising