ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP High Court: అన్నమయ్య ప్రాజెక్టు వ్యవహారంలో నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-09-28T21:44:50+05:30

అన్నమయ్య ప్రాజెక్టు (Annamayya project) కొట్టుకుపోయిన వ్యవహారంలో ఇళ్లకు, పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంపై ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): అన్నమయ్య ప్రాజెక్టు (Annamayya project) కొట్టుకుపోయిన వ్యవహారంలో ఇళ్లకు, పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంపై బుధవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (Nagotu Ramesh Naidu) వేసిన పిటిషన్‌పై న్యాయవాది గోపాలకృష్ణ వాదనలు వినిపించారు. అయితే రైతులకు, మునిగిపోయిన గృహాలకు పరిహారం ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని న్యాయవాది గోపాలకృష్ణ పేర్కొంటూ.. రైతులు, ఇళ్ల యజమానుల జాబితాను న్యాయస్థానానికి అందించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. పరిహారంపై పూర్తిస్థాయి ఆఫిడవిట్ వేయాలని న్యాయవాది గోపాలకృష్ణను ఆదేశించింది. అలాగే ప్రభుత్వం కూడా నష్టపరిహార జాబితాను మరోసారి పరిశీలించాలని సూచిస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2022-09-28T21:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising