ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Court: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనుమతిపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-09-08T20:49:22+05:30

అమరావతి రైతుల మహా పాదయాత్ర (Padayatra)కు అనుమతిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): అమరావతి రైతుల మహా పాదయాత్ర (Padayatra)కు అనుమతిపై గురువారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. అయితే దీనిపై రేపు (శుక్రవారం) నిర్ణయం చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది  పేర్కొన్నారు. 12వ తేదీ పాదయాత్ర అయితే... ముందు రోజు తిరస్కరిస్తారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. రైతులు గత పాదయాత్ర సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనిపై 65 కేసులు నమోదు చేశామని అన్నారు. దీనిపై రైతుల తరపున న్యాయవాది ఉన్నం మురళీధర్ మాట్లాడుతూ ఈ కేసులన్నీ ప్రభుత్వం కావాలని పెట్టిందని అన్నారు. రైతులు పాదయాత్ర నిబంధనల ప్రకారమే నిర్వహించారని పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం గురువారం సాయంత్రం లోపు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం తరువాత శుక్రవారం ఉదయం ఇరుపక్షాల వాదనలు వింటామని, కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2022-09-08T20:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising