ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Payyavula Kesav: రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ అద్భుతం

ABN, First Publish Date - 2022-08-10T02:13:12+05:30

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Ex Cm Chandrababu) ఢిల్లీ పర్యటనపై మీడియాతో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Tdp Mla Payyavula Kesav) చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రపతితో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Ap Ex Cm Chandrababu) ఢిల్లీ పర్యటనపై మీడియాతో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Tdp Mla Payyavula Kesav) చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ అద్భుతంగా జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( president Droupadi Murmu)  తల్లిలా తమతో మాట్లాడారని పయ్యావుల తెలిపారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక నూటికి నూరుశాతం మంచి నిర్ణయమని.. ఆమెతో భేటీ అయిన తర్వాత వ్యక్తిగతంగా మరింత స్పష్టత వచ్చిందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా.. తన దృష్టికి నిరభ్యంతరంగా తీసుకు రావచ్చని రాష్ట్రపతి సూచించారని పయ్యావుల పేర్కొన్నారు.  


‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahostav) అనేది చాలా ఉన్నతమైన కార్యక్రమం. అందుకే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకంగా పొలిట్ బ్యూరోలో చర్చించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సుదీర్ఘకాలం తరువాత అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మా పార్టీ అధినేతను ఢిల్లీలో అన్ని పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దలు బాగా రిసీవ్ చేసుకున్నారు. సీనియర్ పొలిటీషియన్‌గా చంద్రబాబుకు అత్యున్నత స్ట్రేచర్ ఉంది. అది వైసీపీ(Ycp)కి అర్థం కాదు. చంద్రబాబు ఒక్క పర్యటనతో ఢిల్లీలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు సగం కొట్టుకుపోయాయి. ఒక్కరోజు చంద్రబాబు ఢిల్లీలో ఉంటే వైసీపీ ఎందుకో ఉలిక్కి పడుతోంది.’’ అని పయ్యావుల విమర్శించారు. 


Updated Date - 2022-08-10T02:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising