ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి పోరాటం.. శుక్రవారం కార్యాచరణ: ఉద్యోగ సంఘాలు

ABN, First Publish Date - 2022-01-21T00:51:27+05:30

పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్‌‌లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్‌‌లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు..  ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. శుక్రవారం మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. 


కాగా పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ తగ్గించడం, హెచ్‌ఆర్‌ఏలో కోత విధించడంపై  ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల నిరసనలతో ఏపీ అట్టుడికిపోతోంది. పీఆర్‌సికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. జీఓలను రద్దు చేస్తేనే తాము ప్రభుత్వంతో చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. 



Updated Date - 2022-01-21T00:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising