ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా గుప్పిట్లో ఏపీ

ABN, First Publish Date - 2022-01-20T23:33:28+05:30

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 12,615 కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 12,615 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 21,40,056కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,527 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 53,871 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 20,71,658 మంది రికవరీ అయ్యారు. విశాఖలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. భయపడినట్టుగానే రాష్ట్రం మళ్లీ కరోనా గుప్పిట్లోకి చేరుకుంటోంది. రెండు వారాల క్రితం వరకు వంద మార్కుకి పడిపోతూ వచ్చిన కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా వేగం పెంచాయి. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టు అనిపిస్తోంది. ఈ విడతలో విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి అదుపుతప్పింది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళకరంగానే ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ ఉధృతంగా పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Updated Date - 2022-01-20T23:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising