ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Capital Farmers: పెడన నియోజకవర్గానికి చేరుకున్న రైతుల పాదయాత్ర

ABN, First Publish Date - 2022-09-23T16:17:19+05:30

రాజధాని రైతుల మహాపాదయాత్ర ఈరోజు పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాజధాని రైతుల మహాపాదయాత్ర (Amaravati farmers) ఈరోజు పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. శుక్రవారం ఉదయం పెడన నియోజకవర్గానికి పాదయాత్ర (maha padayatra) చేరుకుంది. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు పాదయాత్రకు భారీగా తరలివచ్చారు. పూల వర్షంతో అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమరావతి మహిళలు మాట్లాడుతూ...అమరావతి ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న వారికి సిగ్గుండాలని అన్నారు. ఇరవై యేళ్ల నుంచి యనభై యేళ్ల వృద్దులు వరకు పాదయాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లు అయితే ఇలా ఎండనక, వాననక నడుస్తారా అంటూ మహిళలు ప్రశ్నించారు.


‘‘భూములు ఇచ్చి బజారున పడ్డాం కాబట్టే మా ఆవేదన... మీలాగా పదవులు,  డబ్బు కోసం క్యారెక్టర్‌ను తాకట్టు పెట్టం’’ అని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ (AP Assembly)లో మహిళలను గౌరవించే ప్రభుత్వం అని జగన్ (YS Jagan mohan reddy) గొప్పలు చెబుతారని... బయటకొచ్చి అమరావతి మహిళలను బూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమంలో న్యాయం, ధర్మం ఉన్నాయి కాబట్టే ప్రజలు మద్దతు ఇస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి (AP CM) వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుని అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలని అమరావతి మహిళలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-23T16:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising