ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని సాధారణ మరణాలని సీఎం జగన్ చెప్పలేదు: శ్రీకాంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-03-17T15:40:12+05:30

అమరావతి: టీడీపీ సభ్యులపై ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ సభ్యులపై ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం అసెంబ్లీలో అసత్యాలు చెప్పారు.. తప్పు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడం సమంజసం కాదన్నారు. దేశంలో యావరేజ్ డెత్ రేట్ ఆధారంగా మరణాలు గురించి ముఖ్యమంత్రి చెప్పారన్నారు. అన్ని సాధారణ మరణాలు అని చెప్పలేదని, నాటు సారాను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సిఎం జగన్ చెప్పారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.


ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ సభ్యులకు కొత్తగా శవాలు దొరికితే తప్ప ఈ అంశాన్ని వదిలి పెట్టరంటూ వ్యాఖ్యానించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ టీడీపీ నాయకులు సారాయి మరణాలన్ని సారాయి హత్యలని చెపుతున్నారని మండిపడ్డారు. సాధారణ మరణాలను సారాయి మరణాలుగా శ్మశానాల ముందు కూర్చోని చెపుతున్నారన్నారు. టీడీపీ శవరాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందని, తెలుగుదేశం పార్టీ కార్యాలయం శ్మశానం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నాయకులు కాటికాపరుల్లా పనిచేస్తున్నారని, ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండేందుకు అనర్హులని వెల్లంపల్లి అన్నారు.

Updated Date - 2022-03-17T15:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising