ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Assemblyలో కొత్త రూల్.. ఇకపై గీత దాటారో..

ABN, First Publish Date - 2022-03-15T17:54:33+05:30

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్ వచ్చేసింది. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారం సరికొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్ వచ్చేసింది. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారం సరికొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చారు. ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటో మేటిక్‌గా సస్పెండ్ అయ్యే రూలింగ్‌ను తీసుకువస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్‌ను దాటితే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొచ్చారు స్పీకర్. అంతేకాదు.. సస్పెండ్ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్‌కు స్పీకర్ తమ్మినేని ఆమోదముద్ర వేశారు. కాగా.. ఈ మధ్య అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-03-15T17:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising