ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Assembly Session: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-09-19T15:08:17+05:30

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైంది. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly session) మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం, వరదల్లో ఆహార సరఫరాదారులకు బిల్లుల చెల్లింపు, ప్రభుత్వ ఖాతాల్లో నిధుల వినియోగంపై టీడీపీ సభ్యులు (TDP Leaders) ప్రశ్నలు సంధించనున్నారు. అలాగే అంబేద్కర్ విదేశీవిద్యా పధకంలో అక్రమాలు, రాష్ట్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల కొరతపై వైసీపీ సభ్యులు (YCP Leaders) ప్రశ్నలు వేయనున్నారు. ఈరోజు సభలో ఐదు బిల్లులను ప్రభుత్వం (AP Goverment) ప్రవేశపెట్టనుంది. మరో మూడు బిల్లులపై చర్చ జరుగనుండగా... సభ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థిక పురోగతిపై చర్చ కొనసాగనుంది. విద్యా వైద్య రంగాల్లో నాడు - నేడుపై సభలో చర్చ జరుగనుంది. వ్యవసాయ అనుబంధ రంగాలపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. మరోవైపు ఈరోజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker of the Assembly) ఎన్నిక జరుగనుంది. శుక్రవారం కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadraswamy) ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల ఎంపిక లాంఛనం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated Date - 2022-09-19T15:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising