ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Assembly: పరిపాలనా వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ

ABN, First Publish Date - 2022-09-15T20:00:14+05:30

పరిపాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చను భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ అసెంబ్లీలో పరిపాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చను వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana karunakar reddy) ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) వినూత్న ఆలోచనలతో పరిపాలనా వికేంద్రీకరణ తీసుకువచ్చారన్నారు. కర్నూలు శాసనసభలో ఒక ఇండిపెండెంట్ శాసననభ్యులు ఏనాడో కోరుకున్నారని తెలిపారు. మద్రాసు సభలో రాయలసీమలో తిరుపతి రాజధాని కావాలని కోరారన్నారు. హైదరాబాద్ శాసనసభలో అమరావతి రాజధాని కావాలని కోరుకున్నారని...  ఇది జగన్మోహన రెడ్డి (AP CM) కోరిక కాదు గతంలో తెలుగు ప్రజల కోరిక అని గుర్తు చేశారు. జగన్ (CM Jagan) ఓ ప్రాంతం పట్ల, ఓ సామాజిక వర్గం పట్ల ఏదో కోపం ఉందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, కోస్తాంద్రకు విభిన్న సంస్కృతులు ఉన్నాయన్నారు. ప్రజల వద్దకు పాలనను చేరువ చేయడం దేశంలోనే మొదటి సారి జగన్ (YS Jagan mohan reddy) చేశారని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానికి పెద్దగా ఖర్చు కాదని... కేవలం కోన్ని బిల్డింగ్‌లు కడితే సరిపోతుందన్నారు. వికేంద్రీకణపై చంద్రబాబు (Chandrababu)కు, 29 గ్రామాల భూస్వాములకు మాత్రమే వ్యతిరేఖ భావం ఉందని భూమన కరుణాకర్ రెడ్డి (YCP MLA) తెలిపారు. 

Updated Date - 2022-09-15T20:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising