ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP MLAs vs police: ఎంపీ కారులో అసెంబ్లీకి దూసుకెళ్లిన పీఏ... అదేమంటే సిల్లీ రీజన్ చెప్పిన పోలీసులు

ABN, First Publish Date - 2022-09-15T16:57:29+05:30

ఏపీ అసెంబ్లీలోకి ఎంపీ విజయసాయిరెడ్డి కారును అనుమతించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ అసెంబ్లీలోకి ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasaireddy) కారును అనుమతించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు (TDp MLAs) అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై పోలీసులతో టీడీపీ ఎమ్మెల్యేలు డోల బాల వీరాంజనేయ స్వామి (Dola Bala Veeranjaneya Swami), బెందాళం అశోక్ (Bendalam Ashok) వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యేల కారును బయట ఆపి విజయసాయి రెడ్డి వాహనాన్ని లోపలకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి (YCP MP) వాహనంలో లేరని ఆయన పీఏ ఉన్నారని పోలీసులు చెప్పటంతో టీడీపీ ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయారు. ‘‘what is this’’ అంటూ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి (TDP MLA) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కంటే ఎంపీ పీఏ ఎక్కువ అంటూ నిలదీశారు. అయితే ఫోను మర్చిపోతే పంపామని అధికారులు సిల్లీగా సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలకు సర్ది చెప్పేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నించారు. ఇది మంచి పద్ధతి కాదని టీడీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసెంబ్లీ గేటు బయట ఈ వివాదం జరిగింది. 

Updated Date - 2022-09-15T16:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising