ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Assembly: మంత్రి మేరుగ వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో దుమారం

ABN, First Publish Date - 2022-09-15T18:44:10+05:30

టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిపై మంత్రి మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి (Dola Bala Veeranjaneya Swami0పై మంత్రి మేరుగ నాగార్జున (Meruga nagarjuna) చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపుతున్నాయి. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ (AP Minister) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ (TDP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభలో మంత్రిపై టీడీపీ ప్రివిలేజ్ మోషన్‌ (Privilege Motion)ను ఇచ్చింది. మంత్రి మేరుగ కులాన్ని ప్రస్తావించి మాట్లాడారని టీడీపీ సభ్యులు (TDP MLAs) మండిపడ్డారు. అయితే టీడీపీ సభ్యుల్ని తాను ఏమీ అనలేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించలేదని మంత్రి మేరుగ తెలిపారు. అయితే మేరగ చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డుల్లో ఉన్నాయని... రికార్డులు చెక్ చేసి వాళ్లు ఆ మాట అనలేదంటే తాను రాజీనామా చేస్తానని బాల వీరాంజనేయస్వామి సవాల్ విసిరారు. ‘‘నాపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారనుకున్నా. నా పుట్టుక గురించి అసెంబ్లీ మాట్లాడటం సరికాదు’’ అని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు.


కాగా  మేరుగ నాగార్జునకు మంత్రులు మద్దతుగా నిలిచారు. మంత్రి మేరుగను టీడీపీ సభ్యులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని మంత్రి అంబటి బాబు (Ambati rambabu) అన్నారు. బాలవీరాంజనేయ స్వామి హద్దు దాటి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఎవరైనా దళితుల కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడతారా అని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని సభలో మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ (Buggana rajendranath) చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-09-15T18:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising