ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేం ఎలాంటి చట్ట వ్యతిరేక నిర్ణయం తీసుకోలేదు: పేర్ని నాని

ABN, First Publish Date - 2022-01-10T22:41:29+05:30

తాము ఎలాంటి చట్ట వ్యతిరేక నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తాము ఎలాంటి చట్ట వ్యతిరేక నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టంలోని విషయాలను దర్శకుడు ఆర్జీవీకి వివరించానని తెలిపారు. చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందేనన్నారు. మంగళవారం కమిటీ సమావేశం ఉందని, మంచి సలహాలు, సూచనలు ఎవరు చేసినా స్వీకరిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ ఇబ్బందిపెట్టలేదని పేర్ని నాని తెలిపారు. 


సినిమా టికెట్‌ ధరల వ్యవహారంపై చర్చించేందుకు రావల్సిందిగా పేర్ని నాని రామ్‌గోపాలవర్మను ఆహ్వానించారు. ఇందులోభాగంగా సోమవారం మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో భేటీ అయ్యారు. ఏపీలో టికెట్‌ ధరలు తగ్గించడంపై వర్మ స్పందిస్తూ జగన్‌ ప్రభుత్వంపై, మంత్రుల తీరుపై ఘాటైన విమర్శలు చేశారు. పది ప్రశ్నలు సంధిస్తూ.. వాటికి సమాధానం చెప్పాలని  కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రభుత్వంతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమే అని సవాల్‌ విసిరారు. ప్రభుత్వంతో గొడవ పడటం తన ఉద్దేశం కాదని, అవకాశం ఇస్తే కలుస్తానని వర్మ పేర్కొన్నారు. దీనిపై మంత్రి నాని కూడా ప్రతిస్పందిస్తూ ‘త్వరలో కలుద్దాం’ అని ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో వర్మతో చర్చలు జరిపేందుకు మంత్రి సమయాన్ని కేటాయించారు.

Updated Date - 2022-01-10T22:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising