ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి నానికి మరో ఛాన్స్!

ABN, First Publish Date - 2022-04-09T22:03:09+05:30

మంత్రి కొడాలి నాని.. ఈయన వెలగబెట్టిన మంత్రిత్వశాఖ మంత్రి ఏదో తెలియదు కానీ.. బూతుల మంత్రి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి కొడాలి నాని.. ఈయన వెలగబెట్టిన మంత్రిత్వశాఖ ఏదో తెలియదు కానీ.. బూతుల మంత్రి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం చంద్రబాబును తిట్టడమే ఈయన ఎజెండా. పౌరసరఫరాల శాఖామంత్రిగా నాని ఉద్ధరించింది ఏమీ లేదు. మీడియా సమావేశం పెట్టి టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌ను తిట్టడం ఈయనకు మహా ఇష్టం. అది కూడా వినలేని భాషలో ఉంటుంది. చంద్రబాబును తిట్టేందుకైనా ఈయనను మంత్రిగా కొనసాగిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బహుశా ఈ విషయంలో జగన్‌కు ప్రత్యామ్నాయం లేకపోతే కొడాలికి లక్కీఛాన్స్ దొరికినట్లు అవుతుందని అంటున్నారు. 


ప్రస్తుత మంత్రివర్గంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని ఉన్నారు. ఈసారి అదే సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఎన్టీఆర్‌ జిల్లా నుంచి వసంత కృష్ణప్రసాద్‌కు అవకాశాలు ఉంటాయని ఆయన అనుచరగణం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్‌ కూడా కొడాలి నాని స్టైల్‌లో ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడటం చర్చనీయాంశమైంది. గురువారం గుంటుపల్లిలో వలంటీర్లకు పురస్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వసంత కృష్ణప్రసాద్‌ కార్యక్రమ ఔచిత్యాన్ని మరిచి తన ప్రత్యర్థి, మాజీమంత్రి దేవినేని ఉమాపై బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న సొంత పార్టీ కార్యకర్తలే మంత్రి పదవి కోసం వసంత కూడా బూతుల్లోకి దిగారని చర్చించుకోవడం గమనార్హం. అయితే, వసంత పేరు అసలు పరిశీలనలోనే లేదని సమాచారం. ఆయన బామ్మర్దిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, నియోజకవర్గంలోనూ ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయనకు మంత్రి పదవి కష్టమేనని సొంత పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.

Updated Date - 2022-04-09T22:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising