ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలి రద్దు చేస్తామని బెదిరించారు

ABN, First Publish Date - 2022-10-03T09:41:07+05:30

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదనే పోకడలో ఉన్న పాలకుల విధానాలను ప్రజా తీర్పు ద్వారా తిప్పికొడదాం అని పీడీఎఫ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధానాలను ప్రశ్నించకూడదనడం అప్రజాస్వామికం

పీడీఎఫ్‌, యూటీఎఫ్‌, ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన


అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదనే పోకడలో ఉన్న పాలకుల విధానాలను ప్రజా తీర్పు ద్వారా తిప్పికొడదాం అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు పిలుపునిచ్చారు. పీడీఎఫ్‌, యూటీఎఫ్‌, ఎస్టీయూ, ఇతర సంఘాలు మద్దతిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆదివారం విజయవాడలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో ప్రకటించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ అభ్యర్థిగా పి.బాబురెడ్డి, పట్టభద్రుల అభ్యర్థిగా ఎం.వెంకటేశ్వరరెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ అభర్థిగా కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల అభ్యర్థిగా పోతుల నాగరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె.రమాప్రభ పేర్లను సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. బిల్లులు పాస్‌ కానందుకు శాసనమండలి రద్దు చేస్తామని ప్రభుత్వం మమ్మల్ని బెదిరించిందని తెలిపారు. ఎమ్మెల్సీ కె.లక్ష్మణరావు మాట్లాడుతూ... విద్యా రంగం, ఉపాధ్యాయల పరిరక్షణ, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి డిమాండ్లపై పోరాటానికి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2022-10-03T09:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising