ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దమ్ము లేకే మాపై విష ప్రచారం చేస్తున్నారు: Anitha

ABN, First Publish Date - 2022-07-01T20:01:04+05:30

ఆంధ్రా గోల్డ్(Andhra Gold), సిల్వర్ స్ట్రైప్స్(Silver Stripes), 9సీ హార్స్(9C Horse) మద్యం బ్రాండ్‌లలో విషం లేదని చెప్పే దమ్ము ప్రభుత్వానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : ఆంధ్రా గోల్డ్(Andhra Gold), సిల్వర్ స్ట్రైప్స్(Silver Stripes), 9సీ హార్స్(9C Horse) మద్యం బ్రాండ్‌లలో విషం లేదని చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేక తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత(Vangalapudi Anitha) విమర్శించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ బ్రాండ్స్ అన్నీ ఇప్పుడెందుకు ప్రభుత్వ దుకాణాల్లో కనిపించట్లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం ఆధారాలు బయటపెట్టాకే ఇవి కనిపించకుండా పోవటం వెనక ఆంతర్యమేంటని నిలదీశారు. వాటిలో విషం ఉందని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకుందని అనిత పేర్కొన్నారు. 


ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘విషాన్ని కూడా బంపర్ ఆఫర్‌లో ప్రజలకు అమ్మిన ప్రభుత్వం ఇది. ప్రజలకు విషం పోస్తూ మేం విషం కక్కుతున్నామని సజ్జల చెప్పటం సిగ్గుచేటు. డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కుని ప్రాణాలు తీసుకునే దౌర్భాగ్యం ఏపీలోనే ఉంది. ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్‌లు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమ్మట్లేదు? వైసీపీ ప్రభుత్వ(YCP Government) హయాంలో దాదాపు 100 డిస్టలరీలు రిజిస్ట్రయితే కేవలం 16కు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు స.హ.చట్టం ఇచ్చిన సమాధానానికి ఏం చెప్తారు? అవి జగన్ రెడ్డి బినామీ కంపెనీలు కాబట్టే వాటికి మాత్రమే అనుమతులిచ్చారు. బుద్దున్నవాడు మద్య నిషేధం చేయాలని ప్రకటన చేసిన జగన్ రెడ్డి బుద్ధి ఇప్పుడేమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలనే సంకల్పం ఉన్న వాడు తాగుబోతుల భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టడాన్ని బరితెగింపు అనాలా? లేక అది బుద్దిలేనితనమా.. సిగ్గులేనితనమా?’’ అని మండిపడ్డారు.


Updated Date - 2022-07-01T20:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising