ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి: ఏపీ హైకోర్టు

ABN, First Publish Date - 2022-04-26T17:23:00+05:30

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పిటిషన్లను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పిటిషన్లను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్స్  జిల్లా న్యాయమూర్తి పరిధిలో ఉండాలని ఆదేశించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడంపై బీజేపీకి చెందిన సుధారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుధారాణి తరుపున న్యాయవాది యలమంజుల బాలాజీ  వాదనలు వినిపించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడం పట్ల బాలాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్క కర్నూలు జిల్లాకే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వివాదాలు పరిష్కరించేందుకు ట్రిబ్యనల్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-04-26T17:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising