ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: మట్టి కోసం వైసీపీ నేతల తన్నులాట

ABN, First Publish Date - 2022-04-22T16:40:59+05:30

మట్టి కోసం అధికార పార్టీ నేతల మథ్య ఘర్షణ చెలరేగింది. వెల్వడం వైసీపీలో చెరువు మట్టి తవ్వకాలు చిచ్చురేపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: మట్టి కోసం అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. వెల్వడం వైసీపీలో చెరువు మట్టి తవ్వకాలు చిచ్చురేపాయి. వెల్వడం మోదుగుల చెరువులో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. మట్టి ట్రాక్టర్‌లకు అడ్డంగా కూర్చున్న వెల్వడం సొసైటీ ప్రెసిడెంట్ తోట తిరుపతిరావును మైలవరం వైస్ ఎంపీపీ ప్రత్తిపాటి రత్నబాబు ట్రాక్టర్‌తో తొక్కించబోయాడు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, తోట తిరుపతిరావు వర్గాల మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వసంతతో తేల్చుకొనేందుకు తోట తిరుపతిరావు తన వర్గంతో  మైలవరం పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చారు. పార్టీ ఆఫీస్ వద్ద ఎటువంటి గొడవలు చేయవద్దని  ఎస్‌ఐ రాంబాబు హెచ్చరించాడు. దీంతో ఎస్‌ఐ, ఎమ్మెల్యే పీఏకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సాక్షిగా అధికార పార్టీ గొడవలు బహిర్గతం కావడంతో స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-04-22T16:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising