ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: స్థోమతకు మించి అప్పులు... కోలుకోకపోతే శ్రీలంక లాంటి పరిస్థితులే...

ABN, First Publish Date - 2022-04-04T18:23:45+05:30

ప్రభుత్వాలు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ప్రజలను వాళ్ల కాళ్లపై నిలబెట్టేలా పథకాలు ఉండాలేతప్ప..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కప్పు టీ రూ. వంద, కోడి గుడ్డు రూ. 35. కిలో చికెన్ రూ. వెయ్యి, పచారి షాపుల వద్ద బారులుతీరిన క్యూలు.. ప్రతి రోజు 10 గంటలకుపైగా విద్యుత్ కోతలు. ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితులకు ఇది మచ్చుతునకలు. రాజపక్స అనాలోచిత నిర్ణయాలే.. ఇప్పుడు ఆ పరిస్థితులకు ప్రధాన కారణం. పక్క దేశం సంగతి అటుంచితే.. ఏపీలో పరిస్థితులు కూడా దాదాపుగా అలాగే ఉన్నాయి. ఇప్పటికైనా కోలుకోకపోతే ముప్పు తప్పదనే వాదనలు కూడా ఉన్నాయి.


ప్రభుత్వాలు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ప్రజలను వాళ్ల కాళ్లపై నిలబెట్టేలా పథకాలు ఉండాలేతప్ప.. వారిని ఎందుకూ పనికిరానివారిలా చేయకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో వచ్చేవి శ్రీలంక లాంటి పరిస్థితులే. స్థోమతకు మించి అప్పులు.. భవిష్యత్తుకు భరోసా ఎలా? ప్రభుత్వం చేసిన తప్పులు జనం పాలిట శాపం అవుతాయా? ఏపీలో పరిస్థితులు అచ్చంగా శ్రీలంకనే తలపిస్తున్నాయి. అత్యధిక జీవన వ్యయం, అతి తక్కువ తలసరి ఆదాయం, టెక్నికల్‌గా కనిపిస్తుండగా ప్రత్యక్షంగా పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. 


ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కరెంట్ కోతలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పల్లె ప్రాంతాలను టార్గెట్ చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా గంటల తరబడి కరెంట్ తీస్తున్నారు. అసలే వేసవి కాలం కావడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఏపీలో ఎక్కడా అధికారిక కరెంట్ కోతలు ప్రకటించలేదు. అయినా పెద్ద నగరాల్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియదు. శ్రీలంకలో అధికారికంగా రోజుకు 10 గంటల కరెంట్ కోతలు ప్రకటించారు. ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ వస్తువులు అందుబాటులో ఉండడంలేదు. ప్రజలకు పెద్ద ఎత్తున డబ్బులు ముద్రించి పంచడంతో.. డబ్బులున్నాయి. కానీ తినడానికి తిండిలేదు. ఫలితంగా రేట్లు పెరిగిపోయాయి.


ఏపీలో వివిధ రకాల పన్నులు బాదేసి.. ప్రజలకు నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నారు. ఇంట్లో చెత్తకు పన్ను, ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంట్ చార్జీల పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి. దీంతో సామాన్యుడు అక్కడ బతుకీడ్చాలంటే అల్లాడిపోతున్నాడు.

Updated Date - 2022-04-04T18:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising