ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో సర్పంచ్‌లకు కోపం వచ్చింది...

ABN, First Publish Date - 2022-02-25T20:03:17+05:30

సర్పంచ్‌లకు కోపం వచ్చింది. నిధులు మంజూరు చేయకుండా దారి మళ్లిస్తున్నారంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సర్పంచ్‌లకు కోపం వచ్చింది. నిధులు మంజూరు చేయకుండా దారి మళ్లిస్తున్నారంటూ తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు ముట్టడించారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్‌ను గదిలోపెట్టి నిర్బంధించారు.


పంచాయతీలకు రావాల్సిన రూ. 7వేల కోట్ల నిధులను దారి మళ్లించారని సర్పంచ్‌ల ప్రతినిధులు మండిపడ్డారు. సర్పంచ్‌లకు చెప్పకుండా వారి ఖాతాల నుంచి నిధులు ఎలా మళ్లిస్తారంటూ.. అక్కడే ధర్నాకు దిగారు. సర్పంచ్‌లకు సంబంధించిన నిధులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కేంద్రం విడుదల చేసిన నిధులు కూడా ఇతర పథకాలకు మళ్లించడంతో గ్రామాలు అభివృద్ధి చేయలేకపోతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ వచ్చే వరకు ఇక్కడే బైటాయిస్తామన్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.

Updated Date - 2022-02-25T20:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising