ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న పారిశుద్ద్య కార్మికుల సమ్మె

ABN, First Publish Date - 2022-07-15T00:24:26+05:30

ఏపీలో పారిశుద్ద్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమింపజేసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో పారిశుద్ద్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమింపజేసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. పారిశుద్ద్య కార్మికుల సమ్మెపై మంత్రులు కమిటీ భేటీ అయింది. డిమాండ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చినట్లు చెబుతున్నారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె గురువారానికి నాలుగో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు నిన్న ప్రదర్శనలు, ధర్నాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. కార్మికుల సమ్మెతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా పడింది. చెత్త కుప్పల్లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. అసలే వర్షాలు.. ఆపై సమ్మెతో లోపించిన పారిశుధ్యం.. ఈ పరిస్థితుల్లో రోగాలు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్మిక సంఘాలు చేసిన 22 డిమాండ్లలో 21 పరిష్కరించామని, జీతాల సమస్యపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని, సమ్మె విరమించి విధుల్లో చేరితే చర్చలు జరుపుతామని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బేషజాలకు పోకుండా చర్చలు జరిపి సమ్మెకు పరిష్కారం చూపాలని పారిశుద్ద్య కార్మికుల డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-07-15T00:24:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising