ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసైన్డ్‌కు తూట్లు

ABN, First Publish Date - 2022-10-17T09:13:28+05:30

పేదలు, అణగారిన వర్గాలకు ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల(బదలాయింపు నిరోధక-పీఓటీ) చట్టం-1977 ద్వారా ప్రభుత్వం సాగు భూములు కేటాయిస్తోంది. 2013 నవంబరు నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 32లక్షల ఎకరాలపైనే భూమిని పేదలకు అసైన్‌ చేశారు. ఈ చట్టం కింద సాగు భూములు ఇచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూములపై గురి

పీవోటీ చట్టానికి సవరణలకు ఎత్తులు 

గుట్టుగా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు 

15 నుంచి 20 ఏళ్ల కాలవ్యవధి టార్గెట్‌ 

నిరుపేదలకు లబ్ధి పేరిట పెద్ద డ్రామా 

వారికి హక్కుల కోసం చట్టంలో మార్పులు

అదే జరిగితే పీవోటీ చట్టం నిరుపయోగం 

ఆయన భూ బాగోతాలపై ప్రకంపనలు 

సిట్‌ నివేదిక నిండా ఆయన పేరే 

చట్టం మారిస్తే సుమారు 

600 ఎకరాలు ఆ నేత చేతికి?

సవరణల కోసం కబ్జాదారుల ఎదురుచూపులు


ఆయన ఉత్తరాంధ్రకు చెందిన అధికార పార్టీ నేత. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములను చెరపట్టిన ఆయన... ఇప్పుడు అసైన్డ్‌ భూములపై కన్నేశారు. వాటిని అడ్డగోలుగా సొంతం చేసుకోవడానికి అడ్డొస్తున్న చట్టాన్ని మార్చేందుకు పెద్ద మంత్రాంగాన్నే నడిపిస్తున్నారు. పేదలకే లబ్ధి... అంటూ ధర్మ సూక్తులు చెబుతూ వందల ఎకరాలు స్వాహా చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతున్న రెవెన్యూశాఖ ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల (బదలాయింపు నిషేధ-పీఓటీ) చట్టం-1977లో సవరణలు తీసుకొచ్చేందుకు గుట్టుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ చట్టం మారితే ఆయనకొచ్చేది 400 నుంచి 600 ఎకరాలు! కానీ సర్కారు కోల్పోయే భూమి 32 లక్షల ఎకరాల పైమాటే. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని అసైన్డ్‌ భూముల ఆక్రమణదారులు ఎదురుచూస్తున్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

పేదలు, అణగారిన వర్గాలకు ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల(బదలాయింపు నిరోధక-పీఓటీ) చట్టం-1977 ద్వారా ప్రభుత్వం సాగు భూములు కేటాయిస్తోంది. 2013 నవంబరు నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 32లక్షల ఎకరాలపైనే భూమిని పేదలకు అసైన్‌ చేశారు. ఈ చట్టం కింద సాగు భూములు ఇచ్చిన తర్వాత రైతులకు పట్టాలు ఇస్తారు. ఆ భూములను ఇతరులు కొనుగోలు చేయడం నిషిద్ధం. వాటికి రిజిస్ట్రేషన్‌ చేయరు. అసైన్డ్‌ భూములన్నీ రిజిస్ట్రేషన్‌ చట్టం- 1908 కింద నిషేధ జాబితా 22(ఏ)లో ఉంచారు. దాదాపు ఐదు నెలల క్రితం రెవెన్యూ ఆర్జిత శాఖల సమావేశంలో ఈ భూములపై చర్చ జరిగింది. ‘‘అసైన్డ్‌ భూములను రైతుల పేరిట క్రమబద్దీకరిస్తే సర్కారుకు వేల కోట్ల ఆదాయం వస్తుంది కదా... ఈ పనెందుకు చేయకూడదు?’’ అని ఓ ఐఏఎస్‌ అధికారి ప్రతిపాదించారు. అయితే, చట్టప్రకారం అదంతా కుదరదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆ ప్రతిపాదనకు అప్పటికి బ్రేక్‌ పడింది.


తాజాగా ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. క్రమబద్ధీకరణ రూపంలో కాకుండా, నేరుగా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ వారి పేరిటే కేటాయింపులు చేయాలన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. కేటాయింపు ఉత్తర్వులతో పాటు భూముల రిజిస్ట్రేషన్‌ కూడా రైతుల పేరిటే జరిగిపోవాలని సదరు ఉత్తరాంధ్ర నేత ప్రతిపాదించారు. ఆయనకు ఉత్తరాంధ్రతో పాటు హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉంది. ఆయన వృత్తి రియల్‌ ఎస్టేట్‌. ప్రవృత్తి రాజకీయం. నాటి వైఎస్‌ ప్రభుత్వ హయాంలో కీలక హోదాలో ఉండి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూములను వేర్వేరు మార్గాల్లో హస్తగతం చేసుకున్నారు. విశాఖ భూములపై విచారించిన సిట్‌... సర్కారుకు సమర్పించిన నివేదికలో ఆయన భూదందా అంశాలే కీలకం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో అనధికారిక, చట్ట విరుద్ధమైన ఒప్పందాలు చేసుకొని రైతులకు తక్కువ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఆ నేత ఇప్పటికే 400 నుంచి 600 ఎకరాల అసైన్డ్‌ భూములను తన బినామీలు, బంధువులు, సన్నిహితుల పేరిట జీపీఏలు చేయించుకున్నట్లు సమాచారం. ఇక ఆ భూములు ఆయన సొంతం కావడమే తరువాయి. దీనికి అడ్డొస్తున్న అసైన్డ్‌ చట్టాన్నే మార్చాలని కంకణం కట్టుకున్నారు. రెవెన్యూ వ్యవస్థను గుప్పిట పట్టుకున్న ఆయన చకచకా పావులు కదిపారు. 


అజెండాలో లేకపోయినా... 

ద శాబ్దాలుగా అసైన్డ్‌ భూములు అనుభవిస్తున్న పేదలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తే వారి జీవితాలు బాగుపడతాయనే వాదనతో పీఓటీ చట్ట సవరణ చేయాలని, దీనివల్ల ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని సదరు నేత ఊదరగొట్టించారు. అనుకున్నదే తడవుగా ఇదే అంశంపై రెవెన్యూ కాన్ఫరెన్స్‌లో చర్చకు పెట్టించారు. అజెండా అంశం కాకపోయినా చాలా రహస్యంగానే దానిపై చర్చ జరిగేలా చక్రం తిప్పారు. దీంతో రెవెన్యూ శాఖ దీన్ని ప్రధాన అంశంగా పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనల జాబితాలో చేర్చింది. పేదలకు భూమి అసైన్‌ చేసిన 15 లేదా 20ఏళ్ల తర్వాత వారికి పూర్తి యాజమాన్యపు హక్కులు కల్పించాలని, ఈ మేరకు పీఓటీ చట్టంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించాలన్న ప్రతిపాదనను ఆ శాఖ లిఖితపూర్వకంగా తీసుకువచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే ఫైలు కదిలింది. వాస్తవానికి ప్రతిపాదనలో 20/ 30 ఏళ్ల కాల వ్యవధి అనే అంశాన్ని చేర్చినా చర్చ జరిగింది మాత్రం 15/ 20 ఏళ్ల కాల వ్యవధిపైనే అని తెలిసింది. ఈ మేరకు హక్కులు ఇవ్వాలంటే పీఓటీ చట్టంలో భూమి బదలాయింపుని నిషేధించే 3(2), 4, 5, 7 సెక్షన్లను సవరణ చేయాలి. వీటిని సవరించాలని డ్రాఫ్ట్‌ బిల్లు రూపొందించి అసెంబ్లీ ఆమోదానికి సమర్పించాలి. అక్కడ ఆమోదించాక బిల్లును గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి పంపించి, అక్కడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. అదే జరిగితే పీఓటీ చట్ట స్వరూపమే పూర్తిగా మారిపోతోంది. 


స్వప్రయోజనాల కోసమే... 

అధికారిక లెక్కల ప్రకారం 2013, నవంబరు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలు, అణగారిన వర్గాల వారికి 32 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు కేటాయించారు. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, క్రీడాకారులు, ఇతరులకు ఇచ్చిన భూములు ఇందుకు అదనం. గతంలో అసైన్డ్‌ చట్టం కింద ఇచ్చిన భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగింది. విశాఖ, విజయనగరం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లి, గుంటూరు తదితర పట్టణ ప్రాంతాల్లోనూ ఈ భూములు ఉన్నాయి. వాటి చుట్టూ ఉన్న ప్రైవేటు భూములు రియల్‌ ఎస్టేట్‌ పరిధిలోకి వెళ్లాయి. అయితే పీఓటీ చట్ట రక్షణ వల్ల ఈ అసైన్డ్‌ భూములు మాత్రం పేదల చేతుల్లో భద్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిపై బడా నేతల కన్నుపడింది. ఆ భూములపై పేదలకు యాజమాన్య హక్కులు ఇస్తే వారికి మేలు జరుగుతుందంటూ చట్ట సవరణకు రంగం సిద్ధం చేశారు. నిజానికి దీనివ ల్ల నష్టపోయేది పేదలే. ఎందుకంటే ఒక్క భూముల అమ్మకం తప్ప రైతుబంధు, రైతుభరోసా, పంట రుణాలు, సబ్సిడీలు, ఇతర అన్ని రకాల ప్రయోజనాలు వారికి అందుతున్నాయి. ఒకసారి హక్కులు ఇస్తే పేద రైతులు చిన్నపాటి అవసరాలకు కూడా ఆ భూములు అమ్ముకుంటారు. దానివల్ల వారు మరోసారి భూమిలేని పేదలుగా మిగిలిపోతారు. అదే జరిగితే భూ పంపిణీకి అర్థం లేకుండా పోతుంది. 

Updated Date - 2022-10-17T09:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising