ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra Jyothi, పవన్‌పై మళ్లీ అక్కసు వెళ్లగక్కిన జగన్‌

ABN, First Publish Date - 2022-05-17T01:52:29+05:30

ఆంధ్రజ్యోతి (Andhra Jyothi) జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)పై సీఎం జగన్ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఆంధ్రజ్యోతి (Andhra Jyothi), జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)పై సీఎం జగన్ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం 2022 తొలి విడత నగదు బదిలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపవరంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం 2022 తొలి విడత నగదు బదిలీ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మూడేళ్లగా పారదర్శక పాలన అందిస్తున్నా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వంటి కొన్ని మీడియాలు నామీద బురద చల్లుతున్నాయి. దుష్ప్రచారం చేస్తున్నాయి. నా పాలన గురించి ఏరోజూ ఆ మీడియా చెప్పదు. చూపించదు. చంద్రబాబునాయుడు ఆ రోజుల్లో మోసం చేస్తే ప్రశ్నించలేదు. ఈ రోజు నన్ను ప్రశ్నిస్తున్నారు’’ అని ఆయన తన ఆక్రోశం వెళ్లగక్కారు.


జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి జగన్‌ మరోసారి విమర్శించారు. ‘‘చంద్రబాబు (Chandrababu) దత్తపుత్రుడైన ఓ పెద్దమనిషి రైతుల పరామర్శకు బయల్దేరాడు. ఆ పరామర్శలో పట్టాదారు పాస్‌ పుస్తకం ఉండి, రూ.7 లక్షలు నష్టపరిహారం దక్కని ఒక్క కుటుంబాన్ని చూపించలేకపోయాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా దత్తపుత్రుడు బాధ్యత లేకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు ప్రశ్నిస్తున్నానని చెప్పుకుంటోన్న ఆ దత్తపుత్రుడు అపుడు ఎందుకు ప్రశ్నించలేదు’’ అని  జగన్‌ విమర్శించారు. వ్యవసాయం గురించి తమ ప్రభుత్వం ఏమి చేసిందో, గత ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలందరికీ తెలుసునని, గత-ప్రస్తుత పాలనకు తేడా గుర్తించండి అంటూ జగన్‌ తన ప్రసంగంలో ప్రజలను అడిగారు. 

Updated Date - 2022-05-17T01:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising