ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీవు.. నీ ముఖ్యమంత్రి కాణిపాకంలో ప్రమాణం చేస్తారా?

ABN, First Publish Date - 2022-08-20T05:12:46+05:30

‘మాధవ్‌.. నీవు తప్పు చేయకుంటే.. శీలవంతుడివే అయితే నీవు, నిన్ను వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి జగన కాణిపాకంలో ప్రమాణం చేయగలరా’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి సవాల్‌ విసిరారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీకే పార్థసారథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాధవ్‌కు బీకే పార్థసారథి సవాల్‌

పెనుకొండ, ఆగస్టు 19: ‘మాధవ్‌.. నీవు తప్పు చేయకుంటే.. శీలవంతుడివే అయితే నీవు, నిన్ను వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి జగన కాణిపాకంలో ప్రమాణం చేయగలరా’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి సవాల్‌ విసిరారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో నిజమైనదేనని అమెరికా ల్యాబ్‌ ధ్రువీకరించిందన్నారు. సీఐడీ మాత్రం అది ఫేక్‌ అని చెబుతోందన్నారు. జిల్లా ఎస్పీ అసలైన వీడియో దొరికితే నిజానిజాలు నిగ్గుతేల్చుతామన్నారు. ఒరిజినల్‌ సీడీ ఏమైంది, దానిని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. వైసీపీది అబద్ధాల ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి ఒక పెద్దదొంగ అయితే.. మాధవ్‌ చిన్న దొంగ అన్నారు. మాధవ్‌ శీలవంతుడే అయితే.. నిజాయతీ పరుడే అయితే.. పదవికి రాజీనామా చేసి, ప్రజల్లోకి వచ్చి మళ్లీ పోటీ చేయాలని సవాల్‌ చేశారు. శీలవంతుడవే అయితే ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారన్నారు. లేదంటే జిల్లా నుంచి వెలివేస్తారన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కులసంఘాల సన్మానాలను వాడుకోవడం సిగ్గుచేటన్నారు. కురుబ సంఘం నాయకులు.. నారా లోకే్‌షకు కంబళి కప్పి, సన్మానిస్తే దానిని కూడా రాజకీయం చేయడం శోచనీయమన్నారు. కురుబ కులస్థుడవైన మాధవ్‌కు కుల సంప్రదాయం కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు లోకేష్‌ను విమర్శించే స్థాయి మాధవ్‌కు లేదన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతే కురుబలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని, పెద్దలను గౌరవించే విధంగా మాట్లాడాలని హితవు పలికారు. లేదంటే చరిత్రహీనుడిలా మిగిలిపోతావని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు కురుబ కృష్ణమూర్తి, గుట్టూరు సుబ్బరాయుడు, టౌన కన్వీనర్‌ రవిశేఖర్‌, మహిళా కన్వీనర్‌ గాయత్రి, రామలింగ, నరసింహులు, నాగప్ప, ఆది, చంద్ర పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T05:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising