ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంకను ఆక్రమించిన వైసీపీ నాయకులు

ABN, First Publish Date - 2022-05-25T06:28:56+05:30

కదిరి, హిందూపురం ప్రధా న రహదారిలోని ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వె నుక పెనుకొండరాయుని చెరువుకు వెళ్లే వంక ఉంది.

పెనుకొండరాయుని చెరువు వంకను ఆక్రమించి వేసిన బెసిమట్టాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రూ.కోటి విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా .. చోద్యం చేస్తున్న రెవెన్యూ అధికారులు 

కదిరి, మే 17 :   కదిరి, హిందూపురం ప్రధా న రహదారిలోని ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వె నుక పెనుకొండరాయుని చెరువుకు వెళ్లే వంక ఉంది. ఇక్కడ వంక పరంబోకు దాదాపు 50 సెంట్లు ఉంది. దీనికి సమీపంలోనే నూత నం గా నిర్మిస్తున్న బైపాస్‌ రోడ్డు వెళ్తోంది. దీంతో కబ్జారాయుళ్లు పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తున్నా రు. ప్రస్తుతం ఇక్కడ సెంటు విలువ దాదాపు రూ.ఐదు లక్షల పైగా ఉంది. అటు వంటి విలువైన స్థలాన్ని కబ్జా చేసి, వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు బెసిమెట్లు వేశారు. దీనిపై స్థానికులు రెవెన్యూ అధికా రులకు ఫిర్యాదు చేసినా  రెవెన్యూ అధికారు లు స్పం దించకపోవడం విడ్డూరం. గతంలో  కొంత మంది వైసీపీ నాయకులు పునాధులు వేయ గా.. నాటి తహసీల్దార్‌ మారుతీ వాటిని కూల్చి వేశారు. ఆ తహసీల్దార్‌ బదిలీ అయ్యేం తవర కు వేచి చూసిన  వైసీపీ నాయకులు ఇ ప్పుడు ఏకంగా దాదాపు 30 సెంట్లల్లో ఎనిమి ది బెసిమట్టాలు వేశారు. వీరిలో వైసీపీకి చెందిన వైస్‌ ఛైర్మన కూడా ఉన్నట్లు సమాచారం.


 ఎమ్మెల్యేకు కనిపించలేదా : కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డికి వైసీపీ నాయకులు చేసిన కజ్జాలు కనిపించలేదా అని స్థానిక టీడీపీ నాయకులు  ప్రశ్నిస్తున్నారు. ఏకంగా వంక స్థలాన్ని వైసీపీ వారు కబ్జాలు చేస్తుంటే ఎమ్మెల్యేకు తెలియ కుండా ఉంటుందానని  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందింది వంక పరంబోకు స్థలంలో వేసిన బెసిమట్టాలను తొలగించాలని ప్రజలు  కోరుతున్నారు. 


Updated Date - 2022-05-25T06:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising