ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి బకాసురులు..!

ABN, First Publish Date - 2022-12-16T23:58:53+05:30

కదిరి ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు మట్టి బకాసురులుగా మారారు. కొండలు, గుట్టలను తొలిచేసి, యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. చెరువులను సైతం వదలట్లేదు. ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అటవీ భూముల్లోనూ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు.

సోమేష్‌నగర్‌ సమీపాన మట్టి కోసం తవ్విన కొండ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండలు, గుట్టలను

తవ్వేస్తున్న వైసీపీ నాయకులు

చెరువుల్లోనూ తవ్వకాలు

యథేచ్ఛగా అక్రమ రవాణా

ప్రజాప్రతినిధి, కొందరు

అధికారులకు వాటాలు?

కదిరి

కదిరి ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు మట్టి బకాసురులుగా మారారు. కొండలు, గుట్టలను తొలిచేసి, యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. చెరువులను సైతం వదలట్లేదు. ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అటవీ భూముల్లోనూ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో పెద్దపెద్ద కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. చెరువులు, కుంటల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఎలాంటి అనుమతుల్లేకుండా ఎక్స్‌కవేటర్లతో తవ్వి, ట్రిప్పర్లతో మట్టి రవాణా చేస్తున్నారు. ఇదంతా పబ్లిక్‌గానే సాగుతోంది. మట్టి బకాసురులకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనతోపాటు పలువురు అధికారులకు వాటాలు వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ వారు కావడం, కొందరు అధికారులకు వాటాలు వెళ్తుండడంతోనే మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు

కదిరి ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు మట్టి మాఫియాగా ఏర్పడ్డారు. నియోజకవర్గంలో ఎక్కడ, ఎవరికి మట్టి అవసరమున్నా వీరే సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే కొండలు, గుట్టలను కొల్లగొట్టి, వేలాది టన్నుల మట్టి అక్రమ రవాణా చేశారు. డంపులుగా వేసి, ఇష్టారాజ్యంగా రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన, మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. కొంతమంది అధికారులు మట్టి బకాసురుల నుంచి ట్రిప్పుల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

కరిగిపోతున్న కొండలు

కదిరి ప్రాంతంలో మట్టి బకాసురుల ధన దాహానికి కొండలన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. గతంలో సున్నపుగుట్ట తండా సమీపంలోని కొండల మట్టిని లూటీ చేశారు. ఇప్పుడు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని వడ్డిపల్లి, సోమే్‌షనగర్‌ సమీపంలో ఉన్న కొండను కరిగించేస్తున్నారు. నెలరోజులుగా వేలాది టన్నుల మట్టి ఇక్కడి నుంచి తొలిచేశారు. ఆ మట్టి తవ్విన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడేదో గనుల కోసం తవ్వకాలు జరిపినట్లు కనిపిస్తోంది. జార్ఖండ్‌ పాంతం నుంచి కూలీలను తీసుకొచ్చి, నెలరోజులుగా మైనింగ్‌ చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులకు కనిపించలేదు. మైనింగ్‌ అధికారులైతే సరేసరి. అటవీప్రాంతంలో మైనింగ్‌ చేస్తుంటే సంబంధిత శాఖాధికారులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. ట్రిప్పు మట్టి ఇక్కడి నుంచి పట్టణానికి తరలించడానికి రూ.ఐదువేలు వసూలు చేస్తున్నారు. ప్రకృతి సంపదను అక్రమంగా కొల్లగొడుతున్నారు.

చెరువులు మాయం

గతంలో చెరువుల్లో పూడిక తీసి, రైతులు పొలాలకు తోలుకునేవారు. చెరువు మట్టి సారవంతమైనది కావున ప్రభుత్వం అనుమతించింది. వైసీపీ అఽధికారంలోకి వచ్చాక చెరువుల్లోని మట్టి అక్రమ రవాణాకు అనుమతించినట్లు కనిపిస్తోంది. నల్లచెరువు మండలంలోని పాలపాటిదిన్నె సమీపాన ఎర్రకుంటలో 20 రోజులుగా మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. చెరువులో మట్టితీసి, పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో డంపులు చేశారు. ఆ డంపుల నుంచి అవసరమైనపుడు మట్టిని పట్టణానికి తరలిస్తున్నారు. ఒక టిప్పర్‌ మట్టి రూ.ఆరువేలకుపైగా అమ్ముతున్నారు. చెరువులో మట్టి తీయడానికి ఇరిగేషన అధికారుల అనుమతి తప్పనిసరి. వందలాది టన్నుల మట్టి కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. మట్టి ఇష్టారాజ్యంగా తొలగిస్తే చెరువుల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశముంది.

ప్రతిపక్షం వారివనుకుని..

కదిరి ప్రాంతంలో యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా సాగుతోంది. కొండలను తొలిచి, చెరువుల్లో తవ్వి మట్టిని తీస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇంత పెద్దఎత్తున అక్రమ రవాణా సాగుతుంటే పోలీసులు ఎక్కడ పోయారో అర్థంకాని పరిస్థితి. ఇటీవల ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు మట్టి తవ్వి, అక్రమ రవాణా చేస్తున్నారని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులను పురమాయించారు. వారు చెప్పిన దానికి ఎస్‌ బాస్‌ అన్నట్లుగా పోలీసులు వెళ్లి ట్రిప్పర్లు, ఇతర యంత్రాలను స్వాధీనం చేసుకుని స్టేషనకు తరలించారు. అవి అధికార పార్టీ వారివేనని తెలుసుకున్న ప్రజాప్రతినిధులు.. నాలుక కరచుకున్నారు. వెంటనే ఆ యంత్రాలను వెనక్కు పంపాలని పోలీసులను ఆదేశించారు. అందుకు ఓకే బాస్‌ అన్నట్లుగా పోలీసులు వాహనాలను విడిచిపెట్టారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకుంటాం

మట్టి అక్రమ రవాణా గురించి సమాచారం వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. వెంటనే అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకుంటాం.

- నటరాజ్‌, ఇనచార్జి తహసీల్దార్‌, కదిరి

Updated Date - 2022-12-16T23:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising