ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సభ్యత్వ నమోదును అడ్డుకున్న వైసీపీ నాయకులు

ABN, First Publish Date - 2022-06-30T06:42:31+05:30

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును కొందరు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. డీ హీరేహాళ్‌ మండలం కల్యం గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

సభ్యత్వ నమోదును అడ్డుకుంటున్న వైసీపీ శ్రేణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం, జూన 29: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును కొందరు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. డీ హీరేహాళ్‌ మండలం కల్యం గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. కల్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తిప్పేస్వామి ఇంటి సమీపంలో టీడీపీ కార్యకర్తలు కృష్ణ, సత్తి, కర్ణ సభ్యత్వ నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సురేష్‌, నాగరాజు నేతృత్వంలో కొందరు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. సభ్యత్వం పేరిట రూ.వంద ఎలా వసూలు చేస్తారని గొడవకు దిగారు. గ్రామంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించి, బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్‌ హనుమంతరెడ్డి, రాయదుర్గం పట్టణ కన్వీనర్‌ పసుపులేటి నాగరాజు గ్రామానికి వెళ్లారు. అప్పటికే ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తన సిబ్బందితో అక్కడకు చేరుకుని, టీడీపీ కార్యకర్త కృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషనకు తరలించారు. సభ్యత్వ నమోదును అడ్డుకోవడం పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వారి చర్యల వల్ల గొడవలు చెలరేగే ప్రమాదం ఉందని, పోలీసులు వీరిని కట్టడి చేయాలని కోరారు. 

Updated Date - 2022-06-30T06:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising