ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ కొడుకు..!

ABN, First Publish Date - 2022-06-30T05:41:59+05:30

అది మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన చాంబర్‌. బుధవారం అక్కడికి ఒకాయన వచ్చారు. చైర్‌పర్సన స్థానంలో కూర్చున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన చాంబర్‌. బుధవారం అక్కడికి ఒకాయన వచ్చారు. చైర్‌పర్సన స్థానంలో కూర్చున్నారు. రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. అక్కడితో ఆగకుండా గ్రామ సచివాలయ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అంత హంగామా చేస్తున్న ఆ సారు.. ఎవరా అని ఆరాతీస్తే.. నగర పంచాయతీ చైర్‌పర్సన లక్ష్మీనరసమ్మ కుమారుడు జయరాజ్‌ అని తెలిసింది. ఆయన వ్యవహారంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల మహిళా ప్రతినిధుల స్థానంలో వారి కుటుంబికులు అధికారిక సమావేశాలకు హాజరవుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు మహిళా ప్రతినిధులు రబ్బరు స్టాంపుల్లా ఉంటుండంగా.. వారి కుటుంబ సభ్యులే వ్యవహారాలు చక్కబెడుతున్నారన్నది బహిరంగ రహస్యం. వారు ఇళ్ల వద్దో.. ఇంకెక్కడో ఉండి తతంగం నడిపిస్తుంటారు. మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన కుమారుడు జయరాజ్‌ మాత్రం ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా చాంబర్‌లోనే కూర్చుని, రికార్డుల పరిశీలన, ఆదేశాలతో హంగామా చేశారు. నగర పంచాయతీలో చైర్‌పర్సన తనయుడే అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ పని కావాలన్నా మున్సిపల్‌ అధికారులే... చైర్‌పర్సన తనయుడి వద్దకు పంపుతుండడం శోచనీయం.


మడకశిర టౌన


Updated Date - 2022-06-30T05:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising