ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నాయకుల దౌర్జన్యం

ABN, First Publish Date - 2022-05-17T05:37:34+05:30

ఏబీఎన ఆంధ్రజ్యోతి విలేకరి పట్ల వైసీపీ నాయకులు దౌర్జన్యం ప్రదర్శించారు. కవరేజ్‌ను అడ్డుకోవడంతోపాటు సెల్‌ఫోన లాక్కుని, దురుసుగా వ్యవహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏబీఎన రిపోర్టర్‌ పట్ల దురుసుతనం

కవరేజ్‌ను అడ్డుకుని, సెల్‌ఫోన లాక్కున్న వైనం..

తహసీల్దార్‌కు పాత్రికేయుల ఫిర్యాదు

హిందూపురం టౌన, మే 16: ఏబీఎన ఆంధ్రజ్యోతి విలేకరి పట్ల వైసీపీ నాయకులు దౌర్జన్యం ప్రదర్శించారు. కవరేజ్‌ను అడ్డుకోవడంతోపాటు సెల్‌ఫోన లాక్కుని, దురుసుగా వ్యవహరించారు. సోమవారం హిందూపురం పట్టణంలోని 3వ వార్డు శాంతినగర్‌లో చేపడుతున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కవరేజ్‌కు వెళ్లిన ఏబీఎన ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీనివాసరెడ్డిపై అక్కడున్న వైసీపీ నాయకులు దురుసుగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ వెళ్తున్న దారి ముందువైపు కొంతమంది మహిళలు పారిశుధ్యం, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయనీ, ఇక్కడ ఎవరూ వచ్చి చూసిన దాఖలాలు లేవని ప్రశ్నిస్తుండగా దానిని కవరేజ్‌ చేయడానికి శ్రీనివాసరెడ్డి ముందుకెళ్లారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న వైసీపీ సీనియర్‌ నాయకుడు గోపీకృష్ణ అడ్డుపడి సెల్‌ఫోన లాక్కున్నాడు. గోపీకృష్ణకు మద్దతుగా వైసీపీ కార్యకర్త మనోజ్‌ ఏబీఎన రిపోర్టర్‌ పట్ల దురుసుగా వ్యవహరించాడు. అక్కడున్నవారు సర్దిచెప్పి సెల్‌ఫోన ఇప్పించేశారు. ఈ ఘటనపై తహసీల్దార్‌ శ్రీనివాసులుకు ప్రెస్‌క్లబ్‌ కమిటీ తరపున పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధిని అడ్డుకోవడం, దురుసుగా వ్యవహరించడం తగదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తహసీల్దార్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ విషయాన్ని పోలీసులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వైసీపీ నాయకుడు గోపీకృష్ణ మాట్లాడుతూ కవరేజ్‌ను అడ్డుకోలేదని ముందువైపు మహిళలు ఉంటే అక్కడికి వెళ్లి తీసుకోమన్నానన్నాడు. ఆయన ఫోన తీసుకుని, జేబులోనే పెట్టానేతప్ప లాక్కోలేదన్నారు. సాయంత్రం ఎమ్మెల్సీ అనుచరుడు.. ఏబీఎన రిపోర్టర్‌కు ఫోన చేసి, బెదిరించాడు.

    గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ వార్డులో ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీషేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, వైసీపీ నాయకులు పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు.


Updated Date - 2022-05-17T05:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising