ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేదల కడుపు కొడుతున్న వైసీపీ

ABN, First Publish Date - 2022-09-14T04:48:03+05:30

వైసీపీ ప్రభుత్వం నిరుపేదల కడుపు కొడుతోందని టీ డీపీ వక్కలిగ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప విమర్శించారు.

పేదలకు అన్నదానం చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన


గుడిబండ, సెప్టెంబరు 13: వైసీపీ ప్రభుత్వం నిరుపేదల కడుపు కొడుతోందని టీ డీపీ వక్కలిగ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప విమర్శించారు. మంగళవారం స్థానికంగా అన్న క్యాంటీనను ప్రారంభించి, పేదలకు అన్నదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి అన్న క్యాంటీనలను తొలగించి, పేదలకు అన్నం లేక పస్తులు పెట్టిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్న క్యాంటీనలను ప్రారంభించడానికి వెళితే, దాడులు చే యడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన ద్వారా పేదలకు అన్నం పెడతామన్నారు. పేదల కడుపు మాడ్చుతున్న వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అంతకుముందు ఎనటీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్న క్యాంటీనను ప్రారంభించి పేదలకు అ న్నం వడ్డించారు. కార్యక్రమంలో నాయకులు సునీల్‌, తెలుగు రైతు ప్రధానకార్యదర్శి ఉ గ్రనరసింహప్ప, అధికార ప్రతినిధి జయరామరెడ్డి, జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌, మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, అశ్వర్థామప్ప, హనుమంతరాయుడు,మారేగౌడ్‌ పాల్గొన్నారు. 


నేడు అగళిలో..

అగళి, సెప్టెంబరు 13: మండలకేంద్రంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఈరన్న ఆధ్వర్యంలో అన్నక్యాంటీన ద్వారా బుధవారం ఒక్కరోజు అన్నదానం చేస్తున్నారు. ఈమేరకు మాజీ ఎంపీపీ రామకృష్ణప్ప, మాజీ సర్పంచి శివలింగప్ప, మండల ఎస్సీసెల్‌ అధ్యక్షుడు నాగోజీ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని కోరారు.


Updated Date - 2022-09-14T04:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising