ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల స్థలాల కబ్జాకు వైసీపీ యత్నం

ABN, First Publish Date - 2022-12-10T00:26:36+05:30

దళితులకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని తెలుగు రైతు విభాగం రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు నారాయణస్వామి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నెంబరు 129-2లో నివాసముంటున్న దళితుల ఇళ్లకు విద్యుత అధికారులు కరెంట్‌ కనెక్షన తొలగించారు.

రోడ్డుపై నిరసనకు వచ్చిన దళిత కుటుంబాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రైతు రాప్తాడు అధ్యక్షుడు నారాయణస్వామి

కురుగుంట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన

అనంతపురంరూరల్‌, డిసెంబరు 9: దళితులకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని తెలుగు రైతు విభాగం రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు నారాయణస్వామి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నెంబరు 129-2లో నివాసముంటున్న దళితుల ఇళ్లకు విద్యుత అధికారులు కరెంట్‌ కనెక్షన తొలగించారు. దీంతో వారంతా కురుగుంట ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారికి నారాయణస్వామి మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ 1984లో 40మందికి ఇంటి స్థలాలు ఇచ్చి, ఎస్సీ కార్పొరేషన ద్వారా కోళ్ల ఫాం నిర్వహణకు షెడ్లు కట్టించి జీవనాధారం చూపించారన్నారు. డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల విద్యుత కనెక్షన తొలగించినట్లు చెబుతున్న అధికారులు అవి లేకుండా కనెక్షన ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇదంతా కొంత మంది అధికారపార్టీ నాయకులు, అధికారులు ఆడుతున్న నాటకమన్నారు. 40ఏళ్లుగా ఎవరూ భూమి మాదని రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఇదంతా జరుగుతోందన్నారు. దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి నిరసనను సద్దుమణిగించే యత్నం చేశారు. కార్యక్రమంలో రవి, ఎర్రకొండన్న, బజన కొండన్న, నారాయణస్వామి, రాముడు, రామాంజి మల్లరాయుడు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising