ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి పట్టిన ఖర్మ ఎప్పుడు తొలగునో?

ABN, First Publish Date - 2022-12-07T23:44:29+05:30

రాష్ట్రానికి పట్టిన ఖర్మ తెగాలంటే అధికారంలోకి టీడీపీ రావాల్సిందే అని తెలుగుయువత హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బాబ్‌జాన, పట్టణాధ్యక్షుడు డైమండ్‌ ఇర్షాన, ఎస్సీసెల్‌ రాష్ట్ర నాయకుడు రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరిలో టీడీపీ నాయకులు

కదిరి, డిసెంబరు 7: రాష్ట్రానికి పట్టిన ఖర్మ తెగాలంటే అధికారంలోకి టీడీపీ రావాల్సిందే అని తెలుగుయువత హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బాబ్‌జాన, పట్టణాధ్యక్షుడు డైమండ్‌ ఇర్షాన, ఎస్సీసెల్‌ రాష్ట్ర నాయకుడు రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా... నిజాంవలీ కాలనీలో బుధవారం 15వ వార్డు ఇనచార్జ్‌ హైదర్‌వలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికెళ్లి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడున్నరేళ్ల కాలంలో అన్నికులాలు అణచివేతకు గురయ్యాయన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 12వందలు ఉందన్నారు. వైసీపీ వచ్చిన తరువాత ఇలాంటి భారాలు ప్రజలు మోయక తప్పడంలేదన ఆవేదన చెందారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వలసబాట పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్‌ను, రాష్ట్రంలో చంద్ర బాబునాయుడను ఎన్నుకుంటనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అల్ఫాముస్తఫా, జావీద్‌, ఖాదర్‌బాషా, హరి, శ్రీనివాసులు, రాజేంద్ర, దిల్‌దార్‌, హనుమంతు, శేషు, ఇసాక్‌, బాబావలీ, షాన్వాజ్‌, మహిళనాయకురాలు రమణమ్మ, బుజ్జి, నసీమా, గంగరత్నమ్మ, ప్రేమలత, ఆయిషా తదితరులున్నారు.

Updated Date - 2022-12-07T23:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising