ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో.. ప్రభుత్వ ఆసుపత్రి

ABN, First Publish Date - 2022-08-07T05:04:28+05:30

సాధారణంగా రోగాల బా రిన పడిన వారు నయం చేసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. కానీ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు.

మాతాశిశు కేంద్రం వద్ద పడేసిన వ్యర్థాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం అర్బన, ఆగస్టు 6: సాధారణంగా రోగాల బా రిన పడిన వారు నయం చేసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. కానీ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రత తాండవిస్తోంది. అసలే వర్షాకాలం కావడంతో విషజ్వరాలు, మలేరియా, డెంగీ, అతిసార తదితర వ్యాధులతో ప్రజలు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో వర్షం నీరు నిలువ ఉండి, పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో దోమల బెడద అధికమైంది. చిన్న పిల్లల మాతా శిశువార్డు వెనుక భాగంలోనే ఆసుపత్రి వ్యర్థాలన్నీ పడేస్తున్నారు.మురిగిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన సోకే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి క్వార్టర్స్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం నీరు నిలువ ఉంది. ఇంటికి వెళ్లాలంటే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సూపరింటెండెంట్‌కు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.రాత్రి సమయంలో విషపురుగుల బారిన పడే అవకాశం ఉందని ఆం దోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు


Updated Date - 2022-08-07T05:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising