ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌కు ఘనస్వాగతం

ABN, First Publish Date - 2022-10-07T05:07:20+05:30

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన పుట్టపర్తి ప ర్యటనలో భాగంగా సత్య సాయి ఎయిర్‌పోర్టులో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనస్వాగ తం పలికారు.

గవర్నర్‌కు సత్యసాయి చిత్రపటాన్ని అందిస్తున్న మాజీ మంత్రి పల్లె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50







పుట్టపర్తిరూరల్‌, అక్టోబరు 6: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన  పుట్టపర్తి ప ర్యటనలో భాగంగా సత్య సాయి ఎయిర్‌పోర్టులో జిల్లా  అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనస్వాగ తం పలికారు.  ఉదయం 10 గంటలకు గన్నవరం నుంచి గవర్నర్‌ ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.10 నిముషాలకు పుట్టపర్తి చేరుకోగా ఆయనకు విమానాశ్రయంలో జిల్లాకలెక్టర్‌ బసంతకుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన, ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌, స్థానిక ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీదర్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఆర్డీఓ భాగ్యరేఖ, నగరపంచాయతి చైర్మన తుంగ ఓబుళపతి, పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక కాన్వా యిలో పాయన ప్రశాంతినిలయం చేరుకున్నారు. మొదట సాయి కుల్వంత సభామండపంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొని సత్యసాయి మహాసమాధిని  దర్శించుకున్నారు. సత్యసాయి ఇంటర్‌నేషనల్‌ స్పోర్ట్సు స్టేడియం చేరుకున్నారు.  ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిం చారు. తిరిగి శాంతిభన చేరుకుని  భోజనాంతరం విశ్రాంతి తీసుకున్నారు. మ ధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక కాన్వాయిలో బయలుదేరి పుట్టపర్తి ఎయిర్‌పోర్టు చేరుకున్నారు,  ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరిగి గన్నవరం వెళ్లారు. ఈసందర్బంగా పోలీసులు  గట్టి భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. అధికార యంత్రాంగం గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

గవర్నర్‌కు పల్లె ఘనసన్మానం

పుట్టపర్తి, అక్టోబరు 6: రాష్ట్రగవర్నర్‌ భిశ్వభూషణ్‌ హరిచందనను మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయన బుధవారం ప్రశాంతినిలయంలోని శాంతిభవనకు మాజీ మంత్రి పల్లె చేరుకుని సత్య సాయిబాబా చిత్రపటాన్ని గవర్నర్‌కు బహూకరించి పట్టు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెస్తచలపతి, సామకోటి ఆదినారాయణ, గంగాధర్‌నాయుడు, కరణం సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T05:07:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising