ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూచ.. అది బంగారం కాదు..!

ABN, First Publish Date - 2022-12-31T00:34:22+05:30

పామిడి శివారులోని కేజీబీవీలో అనిత పీఈటీగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే 44వ నెంబరు జాతీయ రహదారిపై దిగి, పాఠశాలకు వెళుతోంది. ఈ మార్గంలో ముళ్ల పొదలు ఉన్నాయి. తన కుమా రుడిని ఎత్తుకుని, చకచకా నడుస్తున్న ఆమెపై పొదల మధ్య నుంచి ఇద్దరు అగంతకులు వచ్చి దాడి చేశారు.

బాధితురాలు అనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామిడి కేజీబీవీ దారిలో చైన స్నాచింగ్‌

పామిడి శివారులోని కేజీబీవీలో అనిత పీఈటీగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే 44వ నెంబరు జాతీయ రహదారిపై దిగి, పాఠశాలకు వెళుతోంది. ఈ మార్గంలో ముళ్ల పొదలు ఉన్నాయి. తన కుమా రుడిని ఎత్తుకుని, చకచకా నడుస్తున్న ఆమెపై పొదల మధ్య నుంచి ఇద్దరు అగంతకులు వచ్చి దాడి చేశారు. చంటి బిడ్డను లాక్కునేందుకు ఒకరు యత్నిం చారు. మరొకరు వెనుకవైపు నుంచి దాడిచేసి, ఆమె మెడలోని చైనను తెంచుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ ద్విచక్ర వాహనంలో ఉడాయించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషనలో బాధితురాలు ఫిర్యాదు చేశారు. సీఐ కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్విస్ట్‌ ఏమిటంటే.. ఆ దుండగులు తెంచుకు వెళ్లింది బంగారం గొలుసు కాదు..! అది గిల్ట్‌ చైన..! ఈ మార్గంలో ఇలాంటి ఆపదలు పొంచి ఉంటాయని గ్రహించిన మహిళా సిబ్బంది, స్వీయ రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కారంపొడి, కత్తులను హ్యాండ్‌ బ్యాగ్‌లో తీసుకువెళుతున్నామని సీఆర్‌టీ సునీత వాపోయారు. - పామిడి

Updated Date - 2022-12-31T00:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising