ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమంలో ఉన్నాం... వేతనాల బిల్లులు పెట్టొద్దు

ABN, First Publish Date - 2022-01-29T05:40:20+05:30

రివర్స్‌ పీఆర్సీపై ఉద్యమం చేస్తున్నామనీ, ఈ నేపథ్యంలో జీతాలకు సంబంధించిన బిల్లులు సీఎ్‌ఫఎంఎ్‌సకు పంపొద్దంటూ పీఆర్సీ సాధన సమితి నేతలు.. ఖజానాశాఖ అధికారులను కోరారు.

ఖజానా శాఖ డీడీకి వినతిపత్రం అందజేస్తున్న జేఏసీల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖజానాశాఖ డీడీకి పీఆర్సీ సాధన సమితి నేతల వినతి


అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 28: రివర్స్‌ పీఆర్సీపై ఉద్యమం చేస్తున్నామనీ, ఈ నేపథ్యంలో జీతాలకు సంబంధించిన బిల్లులు సీఎ్‌ఫఎంఎ్‌సకు పంపొద్దంటూ పీఆర్సీ సాధన సమితి నేతలు.. ఖజానాశాఖ అధికారులను కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించి జనవరి నెల వేతనాలు, పెన్షన్ల బిల్లులు పెడుతున్నారన్న సమాచారం అందుకున్న జేఏసీ నేతలు అతావుల్లా, దివాకర్‌రావు, గోపీకృష్ణ, కులశేఖర్‌రెడ్డి, నరసింహులు శుక్రవారం కలెక్టరేట్‌లోని ఖజానా కార్యాలయానికి వెళ్లా రు. కార్యాలయం ఎదుట గంటపాటు తాజా పీఆర్సీ ఆధారంగా కాకుండా... పాత పద్ధతిలోనే జీతాలివ్వాలని నినాదాలు చేశా రు. అనంతరం ఆ శాఖ డీడీ విజయకుమారితో జనవరి నెలకు సంబంధించిన జీతాల బిల్లులపై చర్చించారు. ఈ సందర్భం గా నేతలు మాట్లాడుతూ... జీతాల బిల్లులను ఆపాలని కోరారు. తాజా పీఆర్సీ ఆధారంగా నివేదికలు పంపితే ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్‌ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ‘మీరు కూడా ఉద్యోగులే కదా... ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండ’ని డీడీని కోరారు. ఇందుకు ఆమె సీఎ్‌ఫఎంఎస్‌, పైస్థాయి అదికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పగా... ఏదేమైనా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంతవరకూ జీతాలకు సంబంధించి బిల్లులును ఆపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ విజయలక్ష్మిని కలిసి ప్రభుత్వం దిగొచ్చే వరకూ జీతాల బిల్లులు పక్కనబెట్టి ఉద్యోగిగా ఆలోచించాలని కోరారు. అనంతరం ఖజానాశాఖ డీడీకి వినతిపత్రం అందజేశారు.


Updated Date - 2022-01-29T05:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising