ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి నీటి విడుదల

ABN, First Publish Date - 2022-08-11T05:20:47+05:30

జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు జిల్లా జలవనరుల శాఖ సీఈ శ్రీనివాసులురెడ్డి, హంద్రీనీవా సుజలస్రవంతి పథకం ఎస్‌ఈ దేశేనాయక్‌ తెలిపారు.

జీడిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న జలవనరుల శాఖ సీఈ శ్రీనివాసులురెడ్డి, హంద్రీనీవా ఎస్‌ఈ దేశేనాయక్‌, ఈఈలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 10: జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు జిల్లా జలవనరుల శాఖ సీఈ శ్రీనివాసులురెడ్డి, హంద్రీనీవా సుజలస్రవంతి పథకం ఎస్‌ఈ దేశేనాయక్‌ తెలిపారు. బుధవారం తమ శాఖ ఇంజనీర్లతో కలిసి వారు జిల్లాలోని హంద్రీనీవా కాలువను పరిశీలించారు. మొదట జీడిపల్లి రిజర్వాయర్‌, రాంపురం, ఇప్పేరు, చోళసముద్రం ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్య టించారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాకు 1000క్యూసెక్కులు నీరు వస్తోందని సీఈ, ఎస్‌ఈలు తెలిపారు. వర్షాలు వస్తున్న నేపథ్యంలో తక్కువ నీటిని తీసుకుంటున్నామని, త్వరలో 2వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు. కాలువ సామర్థ్యాన్ని దృష్టి ఉంచుకుని నీటిని పెంచాలా వద్దా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. హంద్రీనీవా పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ 1.681 టీఎంసీల సామర్థ్యంకాగా ప్రస్తుతం 1.366టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ కెపాసిటీ 1.911టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.441టీఎంసీల నీరు ఉందన్నారు. మారాల రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 0.483టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 0.096టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. చెర్లోపల్లి రిజర్వాయర్‌ సామర్థ్యం 1.608టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.290టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఈనెల 12వ తేదీన జీడిపల్లి నుంచి ఫేజ్‌-2 కాలవ కిందికి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో హంద్రీనీవా ఈఈలు రాజా స్వరూ్‌పకుమార్‌, రాజశేఖర్‌యాదవ్‌, ఇంజనీర్లు  పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T05:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising